IPL-2025కు ఆర్సీబీకి కెప్టెన్‌గా రజత్ పాటిదార్ వ్యవహరించనున్నారు. దీనిపై ఆ జట్టు మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పెషల్ వీడియో రిలీజ్ చేశారు. ‘నాతో పాటు జట్టు సభ్యులందరం మీవెంటే ఉంటాం. ఈ ఫ్రాంచైజీలో మీరు ఎదిగిన విధానం, మీరు ప్రదర్శించిన తీరుతో ఆర్సీబీ అభిమానులందరి గుండెల్లో స్థానం సంపాదించారు. దీనికి మీరు అర్హులు’ అని కోహ్లీ చెప్పారు.