తెలంగాణలో BRS హయాంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు కమిషన్ బహిరంగ విచారణకు ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీ రామకృష్ణారావు హాజరయ్యారు. అఫిడవిట్ ఆధారంగా కమిషన్ క్రాస్ ఎగ్జామినేషన్ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సమయంలో ఫైనాన్స్ ప్రిన్సిపల్ సెక్రెటరీగా రామ కృష్ణ రావు పనిచేశారు. బిల్లుల చెల్లింపులు, తదితర అంశాలపై అతన్ని కమిషన్ ప్రశ్నించనుంది.