నటుడు రానా పుట్టినరోజును పురస్కరించుకొని ఆయనకు సామ్ ప్రత్యేకంగా విషెస్ తెలిపారు. ఇన్‌స్టా స్టోరీస్ వేదికగా ఇవాళ పోస్ట్ పెట్టారు. ‘‘హ్యాపీ బర్త్‌డే డియర్ రానా. ప్రతి పనిలోను 100శాతం శ్రమిస్తారు. ఆ శ్రమించేతత్వం నాలో ఎంతగానో స్ఫూర్తి నింపింది. నేను చేసే ప్రతి పనిని ఇంకా బాగా చేసేలా అది నన్ను ప్రేరేపిస్తుంది. నేను ఎప్పటికీ నీ అభిమానినే. దేవుడి ఆశీస్సులు నీకు ఉండాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.