రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఆలురు స్టేజ్ వద్ద కూరగాయలు అమ్ముకునే వారిపైకి లారీ దూసుకెళ్లిన ఘటనపై సోమవారం మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర మృతి చెందిన వారి బంధువులతో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిఆర్ఎస్ నేతలు తదితరులు పాల్గొన్నారు