రంగారెడ్డి: ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో మరోసారి తప్పులు

60చూసినవారు
రంగారెడ్డి: ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో మరోసారి తప్పులు
తెలంగాణలో నిర్వహిస్తున్న ఇంటర్‌ ప్రశ్నపత్రాల్లో మరోసారి తప్పులు దొర్లాయి. బుధవారం నిర్వహించిన బోటనీ, మ్యాథ్స్‌ పేపర్లలో తప్పులు ఉన్నాయి. బోటనీ 5,7 ప్రశ్నల్లో, మ్యాథ్స్‌ 4వ ప్రశ్నలో తప్పులు ఉన్నట్లు గుర్తించారు. కాగా మంగళవారం కూడా మూడు పేపర్లలో తప్పులు ఉండగా, మొన్న ఇంగ్లీష్‌ పేపర్‌లో ఒక ప్రశ్నలో తప్పు వచ్చింది. ప్రతి రోజూ పేపర్లలో తప్పులు బయటపడటంతో, ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్