రంగారెడ్డి: అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు
ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. మాడ్గుల మండలంలో చారకొండ నుండి ఇర్వీన్ గ్రామానికి సోమవారం ఉదయం 100 మందికి పైగా విద్యార్థులతో వెళుతున్నవెళ్తున్న ఆర్టీసీ బస్సు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదంలో విద్యార్థులకు స్వల్పగాయాలు కావడంతో పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.