రంగారెడ్డి జిల్లాలో ఈ వానాకాలం సీజన్‌లో రైతులు పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు గురువారం అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. గత ఏడాది (2023) వానాకాలం సీజన్‌లో 1, 32, 559 ఎకరాల విస్తీర్ణంలో వరి సాగు చేయగా, ఈసారి (2024 వానాకాలం) 1, 38, 187 ఎకరాల్లో పంటను వేశారు. సాగుకు అనుగుణంగా జిల్లా వ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్, డీసీఎంఎస్ ఆధ్వర్యంలో మొత్తం 45 వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.