ఇబ్రహీంపట్నం: ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

56చూసినవారు
ఇబ్రహీంపట్నం: ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు
మంగళపల్లిలోని శ్రీ చైతన్య టెక్నికల్ క్యాంపస్ లో సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు శుక్రవారం ఫ్యాకల్టిస్, డిప్లొమా విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. అందులో విద్యార్థులు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి అన్నారు. నూతన వ్యవస్థ కోసం సమష్టిగా పోరాటం చేసిందని కొనియాడారు.

సంబంధిత పోస్ట్