ఇబ్రహీంపట్నంలో రేపు జాబ్ మేళ

1532చూసినవారు
ఇబ్రహీంపట్నంలో రేపు జాబ్ మేళ
ఇబ్రహీంపట్నం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం ఉదయం 10 గంటల నుంచి జాబ్ మేళ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ ప్రభు తెలిపారు. నవత రోడ్డు ట్రాన్స్ పోర్ట్ ఆర్గనైజేషన్, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సంయుక్తంగా ఈ మేళ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఇంటర్ పాసైన వారితో పాటు డిగ్రీ ప్రథమ, ద్వితీయ, తృతీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు తమ విద్యార్హతతో పాటు ఇతర ధ్రువపత్రాలతో హాజరుకావాలని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్