సంధ్య ఆక్వా పరిశ్రమలోకి విదేశీయుడు

7109చూసినవారు
సంధ్య ఆక్వా పరిశ్రమలోకి విదేశీయుడు
విశాఖ డ్రగ్స్ రాకెట్‌లో చర్చగా మారిన సంధ్వ ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పరిశ్రమకు వచ్చిన ఓ విదేశీయుడు నగదుతో పోలీసులకు పట్టుబడటం కలకలం రేపింది. ఎన్నికల నేపథ్యంలో ఉప్పాడ ప్రధాన కూడలిలో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. టాంగ్ అనే విదేశీయుడి బ్యాగులో రూ.1.30 లక్షలను సీజ్ చేశారు. సంధ్యా ఆక్వా పరిశ్రమకు చెందిన ప్రతినిధులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. పూర్తి వివరాలు సేకరించి టాంగ్‌ను పోలీసులు విడిచిపెట్టారు.

సంబంధిత పోస్ట్