రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ పరిధిలో గల పలు గ్రామాలలో మంగళవారం సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక నేతలు ముగ్గుల పోటీల కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ముగ్గుల పోటీలలో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రధానం చేసినట్లు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు, యువతలు, స్థానిక నేతలు పాల్గొన్నారు.