ఆర్టీసీ బస్సు ఢీ కొట్టడంతో ఓ మహిళ మృతి చెందిన సంఘటన అబ్దుల్లాపూర్మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గుంతపల్లి గ్రామానికి చెందిన బరిగెల రాములమ్మ జీహెచ్ఎంసీలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్నారు. కాగా బుధవారం ఆమె విధులు ముగించుకొని గ్రామానికి వెళ్లేందుకు మధ్యాహ్నం అబ్దుల్లా పూర్ మెట్ లో ఉండగా, హయత్ నగర్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడిపి ఆమెను ఢీకొట్టాడు. ఈ ఘటనలో రాములమ్మ మృతి చెందింది.