తెలంగాణలో ప్రభుత్వం 'హైడ్రా'ను ఏర్పాటు చేసి మంచి పని చేశారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన సచివాలయంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో వరదలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిజంగా సీఎం రేవంత్ రెడ్డి చెరువుల విషయంలో చాలా మంచి నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. ఇప్పటికే కట్టిన భవనాలకు పరిహారం ఇచ్చి కూల్చి వేయాలని, ఆ విషయంలో మానవతా కోణంలో కూడా చూడాలని అన్నారు.