హైదరాబాద్‌లో నకిలీ కంటి మందులు కలకలం రేపాయి. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు నగర వ్యాప్తంగా తనిఖీలు నిర్వహించారు. బాలాపూర్, ఎర్రగడ్డ, మేడిపల్లి, చైతన్యపురి, జిల్లెలగూడాలోని మెడికల్ షాపుల్లో నకిలీ ఐ డ్రాప్స్, ఆయింట్మెంట్లు భారీగా సోమవారం సీజ్ చేశారు. అయుర్వేదిక్ పేర్లతో కంటి, జ్వరం మందు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. డాక్టర్ సలహా మేరకే మందులు కొనాలని, అలాగే వీటితో కంటి చూపు పోయే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు.