హైదరాబాద్ సంధ్య థియేటర్ ఘటన, అల్లు అర్జున్ అరెస్టుతో కాంగ్రెస్ ప్రభుత్వానికి, టాలీవుడ్‌కు మధ్య దూరంపెరిగింది. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు సమావేశం కానున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో భేటీ కానున్నారు. ఈ సందర్భంగా టికెట్ ధరల పెంపు, బెనిఫిట్ షోలు, అల్లు అర్జున్ అరెస్టు వంటి అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉన్నది.