అసెంబ్లీ సమావేశంలో మూసీ నీటి వ్యవహారంపై అధికార- విపక్షాల మధ్య మాటలు సాగాయి. గురువారం అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు నల్గొండ జిల్లాలో మూసీ నీటి గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డి సమాధానాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు రియాక్ట్ అయ్యారు. దీంతో అధికార-విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకున్నారు.