పోక్సో కేసులో నిందితుడు రిమాండ్

68చూసినవారు
మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని నాగోలు పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. మర్రిపల్లికి చెందిన నల్ల రాజేష్ స్థానికంగా ఉండే మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి గత 4 నెలల నుంచి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న బాలిక కుటుంబ సభ్యులు ఈనెల 12న నాగోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వారు నిందితుడిని మంగళవారం అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్