నేడు BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అఖిల భారత రజక సంఘం జాతీయ అధ్యక్షులు మొగ్గ అనీల్ కుమార్ రజక LB నగర్ ఎంఎల్ఏ సుధీర్ రెడ్డి, దాసోజు శ్రావణ్ లను వెంటబెట్టుకొని వెళ్లి కలిశారు. కాంగ్రెస్ ప్రభుత్వం రజకులకు చేస్తున్న మోసాలమీద అసెంబ్లీలో ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు Y లింగన్న రజక, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు CH లక్ష్మణ్, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ధర్ముల రవి రజక తదితరులు పాల్గొన్నారు.