హయత్ నగర్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం

83చూసినవారు
హయత్ నగర్: ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యం
ఇద్దరు పిల్లలతో సహా తల్లి అదృశ్యమైన ఘటన హయత్ నగర్ పోలీస్టేషన్ పరిధిలో జరిగింది. భర్తకు దూరమైన మందుల సరిత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి అబ్దుల్లాపూర్ మెట్ లోని జేఎన్ఎన్ఎయూఆర్ఎం కాలనీలో నివసించే తన అక్క వద్ద ఉంటుంది. రెండు నెలల క్రితం ఆమె హయత్ నగర్ లోని వీరభద్ర కాలనీలోకి అద్దెకు తీసుకుని రామోజీ ఫిలింసిటీలో షూటింగ్ లో పని చేస్తుంది. మూడు రోజుల నుంచి సరిత ఫోన్ స్విచ్చాఫ్ రావడంతో స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

సంబంధిత పోస్ట్