పద్మశ్రీ మొగులయ్యకు అండగా రాచకొండ కమిషనర్

75చూసినవారు
పద్మశ్రీ కిన్నెర మొగులయ్యకి ప్రభుత్వం ఇచ్చిన భూమిలో గోడలను గుర్తు తెలియని దుండగులు కూల్చివేయడంతో హయత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా తక్షణమే స్పందించిన అధికారులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. ఈ విషయంలో రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు ఐపియస్ మొగులయ్యని సోమవారం ఎల్బినగర్ లోని క్యాంపు కార్యాలయంలో కలిసి మాట్లాడారు. గోడ పునర్ నిర్మించుకొనుటకు తగిన తోడ్పాటు గురించి మొగులయ్య నుండి వివరాలు సేకరించారు.

సంబంధిత పోస్ట్