ప్రభుత్వం అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని ఎంపీడీవో కుసుమ మాధురి చెప్పారు. బుధవారం ఆమనగల్లు లో ఆమె అధికారులకు ఇందిరమ్మ ఇండ్లు, ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, రైతు భరోసా పై నిర్వహించే ఫీల్డ్ సర్వేపై వారికి అవగాహన కల్పించారు. రేపటినుండి పథకాలపై అధికారుల బృందం సర్వే చేయనున్నట్లు ఆమె వివరించారు.