రైతు కార్మిక సమస్యలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పరిష్కరించాలని రైతు, కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. మంగళవారం కార్మికులకు కనీస వేతన చట్టం అమలు చేయాలని, రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆమనగల్లు లో నిరసన తెలిపారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రైతులకు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను అమలు చేయాలని కోరారు. ఉపాధి కూలీల పని దినాలు 200 రోజులకు పెంచి రోజు 600 రూపాయలు కూలీ ఇవ్వాలని చెప్పారు.