ఆమనగల్లు: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత

85చూసినవారు
ఆమనగల్లు: మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత
రాష్ట్రంలో మహిళల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. మంగళవారం ఆమనగల్లు మండలం కోనాపూర్ గ్రామంలో ఇందిరా క్రాంతి పథకం క్రింద 22. 64 లక్షలతో నిర్మించనున్న 113 పశువుల షెడ్డులకు ఆయన భూమి పూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళల అభివృద్ధితోనే రాష్ట్రం అభివృద్ధిలో ముందుంటుందని అందుకోసం పొదుపు సంఘాలకు ప్రభుత్వం విరివిగా నిధులు కేటాయిస్తున్నట్లు వివరించారు.

సంబంధిత పోస్ట్