రేపు కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి పర్యటిస్తున్నట్లు క్యాంపు కార్యాలయం ఇంచార్జి తెలిపారు. పర్యటనలో భాగంగా కడ్తాల్, ఆమనగల్లు, తలకొండపల్లి మండలాలలో కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అదే సమయంలో కడ్తాల్ మండలం మక్త మాధారం నుండి నాగిరెడ్డిగూడ వరకు నూతనంగా నిర్మించనున్న బీటి రోడ్డుకు ఆయన భూమి పూజ చేస్తారని వివరించారు.