ఏపీజీవీబీ బ్యాంకు పేరు మార్పుతో నాలుగు రోజులపాటు సేవలకు అంతరాయం కలుగుతుందని ఆమనగల్లు ఏపీజీవీబీ మేనేజర్ తిరుపతి చెప్పారు. గురువారం మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంక్ ను తెలంగాణ గ్రామీణ వికాస బ్యాంక్ గా జనవరి 1 నుండి పేరు మారుస్తున్నట్లు ఆయన వివరించారు. ఈ మార్పుతో ఖాతాదారులకు ఈనెల 28 నుండి 31 వరకు అన్ని రకాల సేవలు నిలిపివేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. జనవరి 1 నుండి యధావిధిగా సేవలు అందిస్తామన్నారు.