విద్యార్థులకు విద్యతో పాటు క్రీడలతో ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని ఆమనగల్లు మార్కెట్ చైర్మన్ గీతా నరసింహ చెప్పారు. గురువారం కడ్తాల్ మండల కేంద్రంలో మండల స్థాయి సీఎం కప్ క్రీడలలో విజేతలైన క్రీడాకారులకు ఆమె బహుమతి ప్రధానం చేశారు. అనంతరం మాట్లాడుతూ గ్రామీణ క్రీడాకారులు గ్రామాలలో నిర్వహించే క్రీడా పోటీలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.