కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఐదు కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి చెప్పారు. శనివారం ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని కుటుంబ సభ్యులతో కలిసి మైసమ్మ ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మంజూరైన నిధుల ప్రోసీడింగును ఆలయ ఫౌండర్ ట్రస్ట్ శిరోలికి అందజేశారు.