కడ్తాల్ మండల కేంద్రం సమీపం నుండి 765 కేవీ విద్యుత్ హై టెన్షన్ లైన్ సర్వేను నిలుపుదల చేయించాలని ఆదివారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు మల్లు రవికి బాధిత రైతులు విజ్ఞప్తి చేశారు. లైన్ వేయడంతో వ్యవసాయమే జీవనాధారంగా జీవిస్తున్న సన్న, చిన్న కారు రైతులమైన తాము తీవ్రంగా నష్టపోతామన్నారు. కందుకూరు మండలం నేదునూరు ఫారెస్ట్ నుండి లైన్ మంజూరు కాగా దానిని మార్చి కడ్తాల్ మండల కేంద్రం నుండి సర్వే చేస్తున్నారని చెప్పారు.