కడ్తాల్: సమాజంలో ఆధ్యాత్మిక జీవితం ఎంతో గొప్పది

72చూసినవారు
కడ్తాల్: సమాజంలో ఆధ్యాత్మిక జీవితం ఎంతో గొప్పది
సమాజంలో ఆధ్యాత్మిక జీవితం ఎంతో గొప్పదని ముస్లిం మత పెద్దలు చెప్పారు. గురువారం రాత్రి కడ్తాల్ మండల కేంద్రంలో రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఉపవాస దీక్షలో ఉన్న ముస్లిం సోదరులకు మజీద్ కమిటీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. అంతకుముందు షబ్ ఏ ఖాదర్ పర్వదినాన్ని పురస్కరించుకొని వారు మజీద్ లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ అధ్యక్షులు అబ్దుల్ రవూఫ్, ఉపాధ్యక్షులు జావేద్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్