భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఫోర్త్ సిటీకి 300 ఫీట్ల భారీ రోడ్డును ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ మహేశ్వరం నియోజకవర్గ ఇన్చార్జి కేఎల్లార్ అన్నారు. గురువారం తుక్కుగూడా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఈ రోడ్డులోనే ఫోర్త్ సిటీకి మెట్రో రైల్ ను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దీంతో ఇక్కడి ప్రాంత ప్రజలు, రైతులకు లాభం చేరుకూరుతుందన్నారు.