వినాయకచవితి సందర్భంగా బాలాపూర్ లో గణేషుడు కొలువుదీరనున్న నేపథ్యంలో అస్తవ్యస్తమైన రోడ్లను బాగుచేయించాలని కోరుతూ కార్పొరేషన్ మేయర్ చిగురింత పారిజాత బుధవారం జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలిని కలిసి వినతిప్రతం అందజేశారు. అనంతరం ఆమె మాట్లాడారు. నిమజ్జన సమయంలో బాలాపూర్ నుంచి చాంద్రాయనుట్ట మీదుగా గణనాథుడి శోభాయాత్ర నిర్వహిస్తారని, గుంతలమయమైన రోడ్లకు మరమ్మతు చేయించాలని మేయర్ పేర్కొన్నారు.