మహేశ్వరం: సమాచారం ఇవ్వకుండా సర్వే ఎలా చేస్తారు
రైతులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఫ్యూచర్ సిటీ రహదారి కోసం అధికారులు ఎలా సర్వే చేస్తారని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మహేశ్వరం నియోజకవర్గ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ప్రశ్నించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ అధికారులు రైతుల పట్ల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోమన్నారు. రైతులను ఇబ్బంది పెట్టిన ఏ ప్రభుత్వం బాగుపడ లేదన్నారు.