రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో ప్రగతి కాలనీలో భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు బొమ్మ రాజు ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ 129వ జయంతి కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఆమెకు విద్యార్థులతో కలిసి నివాళులు అర్పించారు. నేటి బాలలే రేపటి పౌరులు అని అన్నారు. విద్యార్థులు ఆమెను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమం స్థానికులు, విద్యార్థులు పాల్గొన్నారు.