రెండు రోజులుగా కురిసిన కుండపోత వర్షాలకు, భారీ వరదలకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు తీవ్రంగా నష్టపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలువురుతో పాటు రామోజీ గ్రూప్ సంస్థలు కూడా ముందుకు వచ్చి భారీ విరాళాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణలోని వరద బాధితుల సహాయార్థం రూ.5 కోట్లు అయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి జమ చేస్తున్నట్టు ఓ ప్రకటన జారీ చేశారు. కష్ట కాలంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.