రాజేంద్రనగర్ సర్కిల్ మైలర్ దేవ్ పల్లి డివిజన్ పరిధిలో సంక్రాంతి వేడుకలు బుధవారం ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించడం విశేషం. బాబుల్ రెడ్డి నగర్ మాజీ కౌన్సిలర్ ఎస్ వెంకటేష్ ఆధ్వర్యంలో ఈ పండుగ సంబరాలు ఘనంగా జరిపారు. సంక్రాంతి ఆనందాన్ని చాటుతూ గాలి పతంగులు ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా కొంపల్లి జగదీష్, బెల్లం పల్లి శ్రీను, అర్జున్ తదితరులు పాల్గొన్నారు. వారి సాన్నిధ్యంతో వేడుకలు మరింత ఉత్సాహంగా సాగాయి.