స్ట్రీట్ వెండర్ సంఘం ఆర్థిక సహాయం

84చూసినవారు
స్ట్రీట్ వెండర్ సంఘం ఆర్థిక సహాయం
రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గం షాద్ నగర్ పట్టణంలో పండ్లు అమ్ముకుంటూ జీవనోపాధి పొందుతున్న మురళి కుటుంబానికి వీధి వ్యాపారుల సంఘం ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఇటీవల మురళి కుమారుడు సందీప్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న తోటి వ్యాపారులు సంఘం తరఫున ఐదువేల రూపాయలను మురళి కుటుంబానికి ఆదివారం అందజేశారు.