సైబరాబాద్ సీపీ కార్యాలయంలో నిరసన చేస్తుండగా గాయపడిన మాజీ మంత్రి హరీశ్ రావు, గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఉదయాన్నే పోలీసులు హరీశ్ రావును హౌస్ అరెస్ట్ చేశారు. అయితే, తన చేయికి గాయం తగలడంతో ఆసుపత్రికి వెళ్లేందుకు అనుమతించాలని కోరగా, పోలీసులు అడ్డుకున్నారు. దీని పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చికిత్స పొందే హక్కు లేదా అని ప్రశ్నించారు. చివరికి పోలీసులు ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లారు.