రాష్ట్రంలో బీఆర్ఎస్ నేతల అక్రమ అరెస్టులు కొనసాగుతున్నాయి. పథకాల్లో కోతలు, ప్రజా సమస్యలపై కాంగ్రెస్ సర్కార్‌ను నిలదీస్తున్న ప్రధాన ప్రతిక్ష నేతలను ముందస్తు అరెస్టులతో నిర్బంధిస్తున్నది. ఈ క్రమంలో హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. సోమవారం తెల్లవారుజామునే రంగారెడ్డి జిల్లా కొండాపూర్‌లోని ఆయన నివాసానికి పోలీసులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.