పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు

67చూసినవారు
పురపాలక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్‌ మహానగరంలోని పలు ప్రాంతాల్లో పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి దానకిశోర్ శుక్రవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తొలుత జర్నిలిస్టు కాలనీలోని పాలపిట్ట సర్కిల్ పరిసర ప్రాంతాల్లోని రహదారులపై ప్యాచ్ వర్క్స్ పూర్తి చేయకుండా వదిలేసిన గుంతలను పరిశీలించి స్థానిక అధికారులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏ పనులు చేపట్టినా. ఎప్పటికప్పుడు రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తి చేయాలని ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్