అభిషేక ప్రియుడు హరిహర సుతుడు అయ్యప్ప అని స్వామి కరుణాకటాక్షాలతో ఈ ప్రపంచం సుఖశాంతులతో వర్ధిల్లుతుందని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. గురువారం ఉదయం శ్రీ శివ మారుతి గీత అయ్యప్ప మందిరంలో అయ్యప్ప స్వామికి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో అభిషేకం చేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయ్యప్ప స్వాములకు అన్నదాన భిక్ష పెడుతున్నట్లు ఎమ్మెల్యే శంకర్ స్పష్టం చేశారు.