సౌత్ గ్లాస్ ఘటనపై కేంద్రమంత్రికి వినతి పత్రం

51చూసినవారు
సౌత్ గ్లాస్ ఘటనపై కేంద్రమంత్రికి వినతి పత్రం
షాద్ నగర్ పరిదిలోని సౌత్ గ్లాస్ కంపెనీలో ఐదు మంది కార్మికులు దుర్మరణం పాలవడానికి అధికారుల, కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యమే కారణమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నెల్లి శ్రీవర్ధన్ రెడ్డి ఆరోపించారు. శనివారం సౌత్ గ్లాస్ ఘటనపై కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. పరిశ్రమలో ఐదు మంది కార్మికులు చనిపోగా చాలామంది తీవ్ర గాయాల పాలయ్యారని ఆయన దృష్టికి తీసుకువచ్చారు.

సంబంధిత పోస్ట్