షాద్ నగర్ నియోజకవర్గంలో రాజకీయ, న్యాయవాద రంగాల్లో దురంధరుడు రైతు నాయకుడు తాండ్ర వీరేందర్ రెడ్డి ఇకలేరు. కొంతకాలంగా అనారోగ్యంతో చికిత్స పొందుతున్న తాండ్ర వీరేందర్ రెడ్డి సోమవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. యశోద ఆసుపత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. షాద్ నగర్ నియోజకవర్గంలోని కేశంపేట మండలం పాపిరెడ్డిగూడ గ్రామానికి చెందినతాండ్ర వీరేందర్ రెడ్డి నియోజకవర్గంలోనే ప్రముఖ న్యాయవాదిగా పేరుగడించారు.