ఎల్లప్పుడూ రద్దీగా ఉండే రోడ్డు గుంతల మయమయ్యింది. ప్రజల రాకపోకలకు వాహనదారులకు మరింత ఇబ్బందిగా మారింది. షాద్ నగర్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆదేశాలతో ఫరక్ నగర్ మాజీ ఎంపీపీ వన్నాడ ప్రకాష్ గౌడ్ మట్టి పోసి గుంతల రోడ్డును చదును చేయించారు. బుధవారం సాయంత్రం మున్సిపల్ పరిధిలోని చటాన్ పల్లి రైల్వే బ్రిడ్జి సమీపంలో రోడ్డు గుంతల మయంగా ఉండటంతో మట్టి పోసి చదును చేయించారు.