
షాద్ నగర్: రాష్ట్ర సర్కార్ నిర్ణయంపై హర్షం: కరుణాకర్
కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వరూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన మహా సాధ్వీ సావిత్రీబాయి ఫూలే అని గురువారం షాద్ నగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అభివర్ణించారు. జనవరి 3న చదువుల తల్లిసావిత్రిబాయి ఫూలే జయంతిని రాష్ట్ర పండుగగా ప్రకటిస్తూ విడుదల చేసిన జీఓ ఎంతో సంతోషాన్ని కలిగించిందనీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ హర్షం ప్రకటించారు.