నూతన ఏడాదిని పురస్కరించుకొని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం మైసిగండి మైసమ్మ ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. హైదరాబాద్ నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి అమ్మవారి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిసిపోయింది. భక్తులు గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ నిర్వాహకులు సౌకర్యం కల్పించారు.