గ్రామాల్లో ఇల్లు లేని నిరుపేదల వద్దకు స్వయంగా వెళ్తా వాళ్లకు ఇండ్లు ఇప్పిస్తానని షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ స్పష్టం చేశారు. గురువారం నియోజకవర్గంలోని చౌదరిగుడా మండలం పెద్ద ఎల్కిచర్ల గ్రామంలో ఇందిరమ్మ గృహాల సర్వే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ మండల పార్టీ అధ్యక్షుడు చలివేంద్రం పల్లి రాజు తదితర పార్టీ శ్రేణులతో కలిసి గ్రామంలో పేద ప్రజల వద్దకు వెళ్లారు.