హైదరాబాద్ : కాంపౌండ్ వాల్ పనులను ప్రారంభించిన కార్పొరేటర్
ఐఎస్ సదన్ డివిజన్ లోని డిఎస్ నగర్ కమ్యూనిటీ హాల్ కాంపౌండ్ వాల్, మరియు సెంట్రల్ ఎక్స్చేంజ్ కాలనీ పార్క్ కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులను గురువారం స్థానిక కార్పొరేటర్ జంగం శ్వేత మధుకర్ రెడ్డి చేతుల మీదుగా నిర్మాణం పనులను ప్రారంభించడం జరిగింది. నాణ్యత ప్రణాళికలకు ఏమాత్రం తగ్గకుండా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది పడకుండా పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్కు మరియు సంబంధిత అధికారులను సూచించడం జరిగింది.