100 కోట్ల రైడ్స్ పూర్తి చేసిన రాపిడో

50చూసినవారు
100 కోట్ల రైడ్స్ పూర్తి చేసిన రాపిడో
రైడ్-హెయిలింగ్ ప్లాట్‌ఫామ్ అయిన రాపిడో అరుదైన మైలురాయిని చేరుకుంది. 120 నగరాల్లో 100 కోట్ల రైడ్‌లు పూర్తి చేసుకుందని గురువారం ఆ సంస్థ తెలిపింది. రాపిడో 2015లో ప్రారంభమైంది. బైక్ టాక్సీ సేవలను అందిస్తూ తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. ఆ తర్వాత ఆటో రిక్షా, టాక్సీ క్యాబ్, సరుకు రవాణా లాంటి రంగాల్లో కూడా విస్తరించింది. దేశమంతటా ఎంతో మందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ముందుకెళ్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్