TG: కాళేశ్వరం ప్రాజెక్టు లేకపోయినా రికార్డు స్థాయిలో పంట దిగుబడి వచ్చిందని సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా అమిస్తాపూర్‌లో నిర్వహిస్తున్న రైతు పండుగ సదస్సుకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా 1.53 లక్షల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి వచ్చిందని అన్నారు. కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఇవ్వకపోయినా.. 75ఏళ్లల్లో ఏ రాష్ట్రం ఉత్పత్తి చేయనంత వడ్ల దిగుబడి వచ్చిందని పేర్కొన్నారు.