వయనాడ్ విపత్తు గురించి రాష్ట్రాన్ని కొన్ని రోజుల ముందే హెచ్చరించామని కేంద్రమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై కేరళ సీఎం పినరయి విజయన్ స్పందించారు. తమకు ఎలాంటి అలర్ట్‌ను జారీ చేయలేదంటూ షా వ్యాఖ్యలను ఖండించారు. నిందలు వేసుకునేందుకు ఇది సమయం కాదన్నారు. ఇప్పటివరకు 144 మృతదేహాలను వెలికితీశారని, 191 మంది ఆచూకీ గుర్తించలేదని తెలిపారు. 5,500 మందిని రక్షించినట్లు వెల్లడించారు. 8వేల మందిని 82 శిబిరాలకు తరలించినట్లు పేర్కొన్నారు.